Home   »  తెలంగాణవార్తలు   »   శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు: సిరిసిల్ల

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు: సిరిసిల్ల

schedule yuvaraju
సిరిసిల్ల: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మరియు ఐటీశాఖ మంత్రి KTR సిరిసిల్ల పట్టణంలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం,ఎల్లారెడ్డిపేట మండలంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయాల పునర్నిర్మాణ పనులకు బుధవారం భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా KTR మాట్లాడుతూ వినతిపత్రం ఇచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి,TTD చైర్మన్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.దీంతో ఆలయాల వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టారు.

CM KCR నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నదని, దేవాలయాలు, పాఠశాలలను అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలను గంభీరావుపేట KG టు PG పాఠశాలలా అభివృద్ధి చేస్తున్నారు. భూభాగాలుగా విడిపోయిన తెలుగు ప్రాంతాలు అన్నదమ్ములుగా ఉంటూ అభివృద్ధి సాధించాలన్నది BRS విధానం. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, మైనార్టీలు, బ్రాహ్మణుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని KTR తెలిపారు.

టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గత 4ఏళ్లుగా టీటీడీ నూతన ఆలయాల నిర్మాణం,పునరుద్ధరణ తదితర కార్యక్రమాలు చేస్తోందన్నారు.బడుగు,బలహీన వర్గాలు,గిరిజనులు నివసించే చోట పెద్ద ఎత్తున ఆలయాలు నిర్మిస్తున్నారు.ఈ భూమిపూజ కార్యక్రమంలో బోయినిపల్లి వినోద్‌కుమార్‌ మరియు BRS నాయకులు పాల్గొన్నారు పాల్గొన్నారు.