Home   »  తెలంగాణ   »   సంక్షేమానికి నిలువెత్తు రూపం YSR: TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సంక్షేమానికి నిలువెత్తు రూపం YSR: TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

schedule mounika

తెలుగు నాట సంక్షేమానికి నిలువెత్తు రూపం కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కొనియాడారు. శనివారం షాద్ నగర్ ముఖ్య కూడలిలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం ఆయనది అని అన్నారు. సంక్షేమానికి నిలువెత్తు రూపం YSR , అని ఆయన అనుకున్నది సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన నైజం. ఆయన నవ్వుతూ ఉండేవాడనీ కార్యకర్తలను కూడా నవ్వుతూ ఉండమనేవారనీ అన్నారు. నా లాంటి ఎందరికో రాజకీయ పునాదులు వేసిన నాయకుడు అంటూ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ YSRతో తన పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు వైఎస్సార్‌ కేవలం మంచి వాడే కాదు.. అంతకు మించిన వాడు’ అని చెప్పారు.