Home   »  తెలంగాణ   »   FEVER |తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్..

FEVER |తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్..

schedule mounika

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కు జ్వరం(fever) వచ్చింది. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్(fever) తో సీఎం కేసీఆర్ బాధపడుతున్నట్టు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు

ట్విట్టర్ వేదికగా తెలిపిన మంత్రి కేటీఆర్..

వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం(fever), దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్టు పేర్కొన్నారు. అయితే ఇంటి వద్ద ప్రత్యేక వైద్య బృందం నేతృత్వంలో చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కోలుకుంటారని మంత్రి అదే ట్విట్టర్ లో వెల్లడించారు.

వైరల్ ఫీవర్(fever) గత నెల రోజులుగా చుట్టుముట్టింది.

తెలంగాణను వైరల్ ఫీవర్ గత నెల రోజులుగా చుట్టుముట్టింది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దోమల నివారణ చర్యలు లేకపోవడంతో రాష్ట్ర ప్రజలను డెంగీ, టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్స్.. రోజుల తరబడి మంచానికే పరిమితం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ సొకగానే ప్రత్యేక వైద్య బృంద ఆధ్వర్యంలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు బాగానే ఉంది.

మరీ పేదలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో..

కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న పేదలకు జ్వరం వస్తే గోలీలిచ్చే దిక్కులేదు.. సూది మందు వేసే నాధుడే లేకుండా పోయారు. తెలంగాణ లోని చాలా ఆసుపత్రుల్లో జ్వరం వచ్చిందని వెళితే.. నామమాత్రపు పారాసెటమాల్ గోళీలు ఇచ్చి ఇంటికి పంపుతున్నారు.

అసలు వచ్చిన జ్వరం వైరల్ ఫీవరా..? లేక సాధారణ జ్వరమా..? అన్న టెస్టులేవి చేయకుండానే పారాసెటమాల్ షీట్ చేతికిచ్చి ఇళ్లకు పొమ్మంటున్నారు. రెండు మూడు రోజులు పారాసెటమాల్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుందంటూ వైద్యులు చెబుతుండడంతో ఇంటికి వెళ్లిన జ్వర బాధితులు మొండిగా వైద్యులు చెప్పారని పారాసెటమాల్ తోనే సరిపెట్టుకోవడంతో వైరల్ ఫీవర్ కాస్త తిరగబడుతుంది.

దీంతో విధిలేని పరిస్థితుల్లో అప్పులు జేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి రూ.లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. సీఎం కేసీఆర్ కు జ్వరం వస్తే అందుబాటులో ఉన్న వైద్య బృందం.. మరి నిరుపేదలకు జ్వరం వస్తే ప్రభుత్వాసుపత్రిలో ఎందుకు అందుబాటులో ఉండడం లేదనేది ప్రశ్నార్థకమే.?