Home   »  తెలంగాణవార్తలు   »   24 గంటల విద్యుత్ సరఫరాలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు

24 గంటల విద్యుత్ సరఫరాలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త రికార్డు

schedule raju

సాగుకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. నిరంతర విద్యుత్ అమలుతో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు.

2014కు ముందు..ఆ తర్వాత: 2004 నుంచి 2014 వరకు విద్యుత్ సరఫరా తీరు.. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ అమలుపై చర్చకు ప్రభుత్వంలోని మంత్రులు సవాల్ విసురుతున్నారు. దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు 37,911 కోట్లు వెచ్చించారు. వినియోగంలో 33% వ్యవసాయం నుంచేనని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాగు విద్యుత్ కనెక్షన్లు లక్షల్లో పెరిగాయి. 2018 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ అందుతోంది. జనవరి 1, 2018 తెలంగాణ రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు, ప్రణాళికలతో ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.