Home   »  తెలంగాణ   »   ఖమ్మంలో పొంగులేటికి చెందిన 9750 గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్న ECI

ఖమ్మంలో పొంగులేటికి చెందిన 9750 గోడ గడియారాలను స్వాధీనం చేసుకున్న ECI

schedule sirisha

Telangana polls | హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS) మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీప బంధువు తుంబూరు దయాకర్ రెడ్డి ఇంట్లో రూ.46.89 లక్షల విలువైన 9,750 గోడ గడియారాలను ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది.

గోడ గడియారాలపై పొంగులేటి శ్రీనివాస రెడ్డి యొక్క చిత్రం ఉంది. ఇది తెలుగులో “నా కుమార్తె వివాహం సందర్భంగా, ప్రేమతో, మీ శ్రీనన్న” అని BRS కి గుర్తయిన పింక్ కలర్‌ తో హైలైట్ చేశారు. ఆగస్టు 2022లో రూ. 250 కోట్ల విలువైన ఈ వాచీలను ఆయన కుమార్తె పెళ్లి సందర్భంగా ఖమ్మం గ్రామ ప్రజలకు జ్ఞాపకంగా ఇచ్చారు.

Telangana polls కారణంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పన్నాగాలు

మిగిలిన గోడ గడియారాలను ఆయన బంధువు తుంబూరు దయాకర్ రెడ్డి నివాసంలో ఉంచి ఇటీవల కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పంపిణీ చేసినట్లు సమాచారం అందుకున్న భారత ఎన్నికల సంఘం (ECI) స్వాధీనం చేసుకొని సీజ్ చేసారు.

Also read :కేవలం 8 రోజుల్లోనే రూ.101 కోట్ల విలువైన నగదు స్వాధీనం