Home   »  తెలంగాణ   »   మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత

మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత

schedule raju

కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటి ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ మంత్రి ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించారు. ఉదయం నుంచి ముందస్తు అరెస్ట్‌లు చేసిన నిరసన ఆగలేదు. మంత్రి ఇంటి గేటు దూకి బిజేపీ శ్రేణులు లోపలికి వెళ్లారు.

దీంతో పోలీసులు అడ్డుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలని అరెస్టు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని బిజెపి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది బిజెపి కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.