Home   »  తెలంగాణ   »   TET Exam : టెట్ పరీక్ష రాసేందుకు వచ్చి గర్భిణి మృతి..

TET Exam : టెట్ పరీక్ష రాసేందుకు వచ్చి గర్భిణి మృతి..

schedule ranjith

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న టెట్ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ (TET Exam) కోసం వచ్చి గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రాధిక అనే గర్భిణి పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చింది.

ప్రధానాంశాలు:

  • సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన
  • బీపీ ఎక్కువై కుప్పకూలిన గర్భిణి
  • టెట్‌ పరీక్ష కోసం వచ్చి గర్భిణి మృతి

రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ (TET Exam) పరీక్ష జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పేపర్-1 కూడా పూర్తయింది. అయితే సంగారెడ్డి జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ గర్భిణి మృతి చెందింది. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పరీక్షకు ప్రిపేర్ అయిన రాధిక అనే గర్భిణి తన భర్తతో కలిసి పరీక్ష రాసేందుకు పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ కు వచ్చింది. అయితే, ఆలస్యం అవుతుందే మోనని పరీక్ష హాల్ లోకి వేగంగా వెళ్లింది. దీంతో బీపీ పెరిగి హాలుకు చేరుకున్న కాసేపటికి కుప్పకూలింది. ఇన్విజిలేటర్ గమనించి అధికారులకు సమాచారం ఇవ్వగా..కేంద్రం బయట వెయిట్ చేస్తున్న రాధిక భర్త అరుణ్ అక్కడికి చేరుకున్నాడు. సిబ్బంది సాయంతో రాధికను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రాధిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో అరుణ్ కన్నీటిపర్యంతమయ్యాడు. రాత్రింపగలు చదివి, పరీక్ష రాయడానికి వస్తే ప్రాణాలే పోయాయని విలపించాడు.