Home   »  తెలంగాణ   »   బీఆర్ఎస్ తొలి జాబితా… పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత

బీఆర్ఎస్ తొలి జాబితా… పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత

schedule raju

హైదరాబాద్: మరికాసేపట్లో ‘బీఆర్ఎస్’ అభ్యర్థులను సీఎం ప్రకటించనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే అందరూ తమ అభిమాన అభ్యర్థులను ప్రకటిస్తారో లేదోనని టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారు. దాదాపు సిటింగ్‌ అభ్యర్థులకే సీట్లు ఖరారైనట్లు తెలుస్తుండగా.. పలుచోట్ల అభ్యర్థులను మారుస్తారనే వార్తలపై ఉత్కంఠత నెలకొంది. ఇప్పటికే పలువురు కార్యకర్తలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌ ఒకేసారి 105 మంది ‘బీఆర్ఎస్’ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న నేపథ్యంలో చాలామంది ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఆశావహులు.. తమ పేరు జాబితాలో ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటలిజెన్స్ వర్గాలకు ఫోన్‌ చేస్తున్నట్లు సమాచారం.

ముందుగా అనుకున్నట్లే 02:20 నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకోనున్నారు. పంచమి తిథి కావడం, పైగా శుభ ముహూర్తం కూడా ఉండటంతో ఎంత మంది సిట్టింగులు అసంతృప్తి చెందినా.. ఆశావహులకు భంగం కలిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ప్రకటన చేయాల్సిందేనని కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. సరిగ్గా 02:30 గంటలకు ప్రగతి భవన్ వేదికగా అభ్యర్థుల జాబితాను కేసీఆర్ చదవడం మొదలుపెట్టనున్నారు. 02:30 గంటల నుంచి 03:00 గంటలకు వరకు అభ్యర్థుల ప్రకటన ఉండనుంది.