Home   »  తెలంగాణ   »   శీతాకాలంలో వేసవిని తలపిస్తున్న ప్రాంతాలు ఇవే….

శీతాకాలంలో వేసవిని తలపిస్తున్న ప్రాంతాలు ఇవే….

schedule sirisha

హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్ లో శీతాకాలం(winter season) మధ్యలో వాతావరణం వేసవిని తలపిస్తుంది. అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌ దాటింది. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

వర్షాకాలం ముగిసినప్పటి నుంచి హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదనంగా హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతు వస్తున్నాయి. నిన్న అంబర్‌పేటలో అత్యధికంగా 25.3 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Winter Season లో వేసవిని తలపించే ప్రాంతాలు

  • నాంపల్లి 35.5 డిగ్రీ సెల్సియస్‌
  • మోండా మార్కెట్ 35.4 డిగ్రీ సెల్సియస్‌
  • మారేడ్‌పల్లి 35.2 డిగ్రీ సెల్సియస్‌
  • షేక్‌పేట 35.2 డిగ్రీ సెల్సియస్‌

హైదరాబాద్ వాతావరణ సూచనలు

TSDPS వాతావరణ సూచన ప్రకారం హైదరాబాద్‌లో మరో మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వెల్లడించారు.

నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత 20-22 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాబోయే కొద్ది రోజులు, హైదరాబాద్‌లో శీతాకాలం సీజన్‌లో వేసవి లాగే వేడి కొనసాగుతుందని అంచనా.