Home   »  తెలంగాణ   »   Cherlapalli | త్వరలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం కానున్న రైలు సేవలు

Cherlapalli | త్వరలో చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం కానున్న రైలు సేవలు

schedule ranjith

Cherlapalli | హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన చర్లపల్లి (Cherlapalli) రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. మార్చి ఫస్ట్ వీక్‌లో ప్రధాని మోదీ ఈ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. కాగా, ఈ స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే, ఆగే ట్రైన్ల వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.

Cherlapalli | Train services to start soon from Cherlapally railway station

హైదరాబాద్‌లో కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ (నాంపల్లి), కాచిగూడ రైల్వేస్టేషన్లు ఉండగా, వీటికి తోడు నాలుగో స్టేషన్‌ చెర్లపల్లిలో సిద్ధమవుతోంది. సికింద్రాబాద్ తర్వాత హైదరాబాద్‌లో ఇదే అతిపెద్ద టెర్మినల్. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మోదీ ఈ స్టేషన్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కాగా, సికింద్రాబాద్‌, ఇతర స్టేషన్లపై ప్రయాణికుల తాకిడి తగ్గించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి 25 జతల ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు నడపాలని సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయించారు.

ఈ దిశగా రైల్వే బోర్డుకు అనుమతులు కోరుతూ లేఖ రాయగా 3 జతల రైళ్లకు సంబంధించి అనుమతులు వచ్చాయి. మరో 6 జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా చర్లపల్లిలో ఆపేందుకు బోర్డు అనుమతించింది.

చెర్లపల్లి నుంచి ప్రారంభం కానున్న రైళ్లు

18045/18046 షాలీమార్- హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్
12603/12604 MGR చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
12589/12590 గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

చెర్లపల్లిలో ఆగే రైళ్లు (Cherlapalli)

17011/17012 హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
12757/12758 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్
17201/17202 గుంటూరు – సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్
17233/17234 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
12713/12714 విజయవాడ – సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్
12705/12706 గుంటూరు – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్

Also Read | త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్