Home   »  తెలంగాణవార్తలు   »   జలదిగ్బంధంలో గిరిజన ప్రాంతాలు

జలదిగ్బంధంలో గిరిజన ప్రాంతాలు

schedule sirisha

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు, శబరి ఉపనది, గోదావరిలోకి భారీగా వరద ప్రవహించడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఏటపాక, దేవీపట్నం మండలాలు జలదిగ్బంధంలో ఉన్నాయి.

మండలాల్లోని 130 గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉన్నందున, వరద ప్రభావిత గ్రామాల ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి వెంటనే సహాయక శిబిరాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు.

ఏటపాక మండలం రామాయంపేట గుండాల వరద నీటిలో మునిగిపోయింది. వీఆర్ పురం మండలం అన్నవరం సమీపంలో కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజల భద్రత కోసం అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తున్నారు.