Home   »  తెలంగాణ   »   మేడారం జాతరలో ఎత్తు బంగారం సమర్పించుకున్న కేంద్ర మంత్రి..!

మేడారం జాతరలో ఎత్తు బంగారం సమర్పించుకున్న కేంద్ర మంత్రి..!

schedule raju

Kishan Reddy visited medaram | కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని, ఈ జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని రాష్ట్ర నేతలు అడుగుతున్నారని తెలియజేసారు.

medaram sammakka sarakka jatara 2024 dates

Kishan Reddy visited medaram | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఎత్తు బంగారాన్ని(బెల్లం) అమ్మవార్లకు సమర్పించుకున్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ములుగులో సమ్మక్క-సారలమ్మ యూనివర్సిటీ ప్రారంభిస్తామని, మెజార్టీ సీట్లు స్థానిక గిరిజన విద్యార్థులకే కేటాయిస్తామన్నారు. తాత్కాలిక భవనంలో క్లాసులు ఈ ఏడాది నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

మేడారంపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు: కిషన్‌ రెడ్డి

మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈ జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని రాష్ట్ర నేతలు అడుగుతున్నారని చెప్పారు. జాతీయ పండుగ విధానం ఎక్కడా లేదని, మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామని చెప్పారు. రేపు చాలా మంది కేంద్ర మంత్రులు అమ్మవార్ల దర్శనానికి వస్తారని తెలిపారు.

మేడారం జాతరకు పోటెత్తిన శివసత్తులు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన శ్రీ సమ్మక్క-సారక్క మహా జాతరకు ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం శివసత్తులు పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి వస్తున్నారు. ఈ సందర్బంగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి శివసత్తులు ప్రత్యేక పూజలు చేస్తూ వారి మొక్కులను చెల్లించుకుంటున్నారు. కాగా ఇవాళ రాత్రి సమ్మక్క గద్దెపైకి రానుంది.

Also Read: మేడారం సమ్మక్క సారక్క జాతర తేదీలు, విశేషాలు..!