Home   »  తెలంగాణ   »   నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల

schedule sirisha

నాగార్జున సాగర్: నాగార్జున సాగర్ డ్యామ్ (Nagarjuna Sagar Dam) నుండి ఎడమ కాలువకు నీటి విడుదలను పునఃప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు (KCR) అధికారికంగా తెలిపారు.

గత పక్షం రోజులుగా వివిధ ప్రాంతాల్లో ఏర్పడ్డ గుంతలు మరమ్మతు పనులే లక్ష్యంగా పెట్టుకొని శుక్రవారం సాయంత్రంలోగా మరమ్మతులు పూర్తి చేస్తామని ఇంజినీర్లు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత శనివారం ఉదయం 11 గంటలకు మళ్ళి ఈ కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

KCR, నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నీటి విడుదలను అధికారికంగా వెల్లడి

నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడం వల్ల, వేసిన వరిచేను దెబ్బతినే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతాల రైతాంగం, శాసనసభ్యులు, మంత్రులు గత నాలుగైదు రోజుల నుంచి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావుకు పలు విజ్ఞప్తి లేఖలు అందిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఇరిగేషన్ శాఖ ఉన్నతా అధికారులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సమీక్ష సమావేశంలో సాగర్ ఎడమ కాలువ కింద వరి పంటలకు సాగునీరు అందించే విషయంపై చర్చించి నీటి విడుదల పై అధికారికంగా నివేదికను వెల్లడించారు. మరో 20 రోజుల తర్వాత కూడా మరో సారి తడి కోసం నీటిని విడుదల చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.