Home   »  తెలంగాణ   »   నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..!

నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు..!

schedule raju

Yadadri Brahmotsavam 2024 | శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. దీనికనుగుణంగా ఆలయ అధికారులు 10 వేల మంది భక్తులు కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు.

Yadadri Brahmotsavam 2024 starts from today

Yadagirigutta : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నరసింహులు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం (నేటి నుండి) ప్రారంభం కానున్నాయి. తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

శృంగార డోలోత్సవంతో ముగియనున్న Yadadri Brahmotsavam 2024

ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో వేడుకలు ముగియనున్నాయి. ఉత్తర మాఢ వీధుల్లో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా 11 రోజులు స్వామివారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆలయ అధికారులు 10 వేల మంది భక్తులు కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు CM రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులందరూ హాజరుకానున్నారు. స్వామివారికి రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు CM, మంత్రులు హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకుంటారు.

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండపైనున్న ఆలయంపై ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేస్తామని ఈవీ రామకృష్ణారావు తెలిపారు. కొండపైకి భక్తులను, వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు.

11 రోజుల వేడుకలు

మార్చి 11విశ్వకేశన ఆరాధన, స్వస్తివచనం, అంకురారోపణం, రక్షా బంధనంఅంకురార్పణం  
మార్చి 12ద్వజారోహణం భేరీపూజ, దేవతాహవనం, హవనం (సాయంత్రం 6గం)
మార్చి 13మత్స్య అవతార అలంకర్ణ శేష వాహన సేవ 
మార్చి 14వటపత్రసాయి అలంకారం హంస వాహన సేవ 
మార్చి 15శ్రీ కృష్ణ అలంకారం పొన్న వాహన సేవ 
మార్చి 16గోవర్ధనగిరి అలంకారం సింహ వాహన సేవ 
మార్చి 17జగన్మోహినీ అలంకారం అశ్వ వాహన సేవ, ఎదురుకోలు ఉస్తవం 
మార్చి 18శ్రీరామ అలంకారం, హనుమంత సేవ, తిరుకల్యాణ మహోత్సవం 
గజ వాహన సేవ 
మార్చి 19గరుడ వాహన సేవదివ్య విమాన రథోత్సవం
మార్చి 20మహాపూర్ణాహుతి, చక్రతీర్థంశ్రీపుష్పయాగం
మార్చి 21ఘటాభిషేకంశృంగార డోలోత్సవం , ఉస్తవం సమాప్తి.

ప్రతి సంవత్సరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ మాసాల్లో అంటే శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు (11) రోజులు (సాధారణంగా ఫిబ్రవరి & మార్చి నెలల్లో) నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఉత్సవాలు మార్చి 11న ప్రారంభమై మార్చి 21న ముగుస్తాయి.

Also Read: అస్సాంలో రూ.17,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని..!