Home   »  ఈరోజు   »   Today Horoscope 14 March 2024 | గురువారం నాటి రాశిఫలాల వివరాలు..!

Today Horoscope 14 March 2024 | గురువారం నాటి రాశిఫలాల వివరాలు..!

schedule raju

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల రోజువారీ జాతకంలో ప్రేమ, ఆరోగ్యం, డబ్బు, వృత్తికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

Today Horoscope 14 March 2024

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

మేష రాశి (Aries Today Horoscope 14 March 2024):

ఈరోజు మీరు అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. సంతాన యోగానికి సంబంధించిన శుభవార్త అందుతుంది. మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేయడంలో విజయం సాధించొచ్చు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

  • ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

వృషభ రాశి (Taurus Today Horoscope 14 March 2024):

నేడు ఈ రాశివారికీ ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరుగుతాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త పాటించండి. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి.

  • ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 1
  • అదృష్ట రంగు: ఎరుపు
  • పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.

మిథున రాశి (Gemini Today Horoscope 14 March 2024):

ఈరోజు ఈ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయానికి డబ్బు అందుతుంది. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కొద్ది వ్యయ ప్రయాసలతో పనులన్నీ పూర్తి చేస్తారు.

  • ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 5
  • అదృష్ట రంగు: తెలుపు
  • పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ పఠించాలి.

కర్కాటక రాశి (Cancer Today Horoscope 14 March 2024):

ఈరోజు మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులకు లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యవహారా లను సకాలంలో పూర్తి చేస్తారు. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం అవసరం.

  • ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 12
  • అదృష్ట రంగు: గోధుమ రంగు
  • పరిహారం : ఈరోజు మూగ జీవాలకు ఆహారం దానం చేయాలి.

సింహ రాశి (Leo Today Horoscope 14 March 2024):

ఈరోజు మీరు వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఏ పని చేపట్టినా విజయాలు సాధిస్తారు. స్థిర, చరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన వ్యూహాలు ఫలిస్తాయి.

  • ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 4
  • అదృష్ట రంగు: నారింజ
  • పరిహారం : ఈరోజు శ్రీకృష్ణునికి వెన్న, పంచదార సమర్పించాలి.

కన్య రాశి (Virgo Today Horoscope 14 March 2024):

ఈరోజు మీ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. హోటల్‌, వైద్యం, రిటైల్‌ వ్యాపారాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. సోదరుల నుంచి ఆస్తి వివాదాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు చాలావరకు తగ్గిపోతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి.

  • ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 15
  • అదృష్ట రంగు: పసుపు
  • పరిహారం : ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి.

తుల రాశి (Libra Today Horoscope 14 March 2024):

ఈరోజు మీరు చేపట్టిన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనకూలంగా ఉంటుంది. రాజకీయ, సినీ రంగాల వారికి పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి మంచి ఆఫర్లు అందివస్తాయి.

  • ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 10
  • అదృష్ట రంగు: గులాబీ రంగు
  • పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.

వృశ్చిక రాశి (Scorpio Today Horoscope 14 March 2024):

ఈ రాశివారికి నేడు ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారులకు న్యాయపరమైన సమస్యలు తొలగిపోతాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు.

  • ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 3
  • అదృష్ట రంగు: గులాబీ రంగు
  • పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.

ధనుస్సు రాశి (Sagittarius Today Horoscope 14 March 2024):

ఈరోజు మీరు వృత్తి, ఉద్యోగాలలో కొన్ని చికాకులు, సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  • ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 16
  • అదృష్ట రంగు: మెరూన్
  • పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.

మకర రాశి (Capricorn Today Horoscope 14 March 2024):

నేడు ఈ రాశివారు కొత్త వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించిన ప్రయాణాలు, సమావేశాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధికారుల అదరణ లభిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో ఆటంకాలున్నా పట్టుదలగా పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి.

  • ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 7
  • అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు తులసికి నిత్యం నీరు సమర్పించి దీపం వెలిగించాలి.

కుంభ రాశి (Aquarius Horoscope 14 March 2024):

ఈరోజు మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది. పిల్లల చదువులకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో చిక్కులు తొలగిపోతాయి. రుణాలు, పెట్టుబడులు, షేర్‌మార్కెట్‌ లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలు అందుకుంటారు.

  • ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 2
  • అదృష్ట రంగు: బూడిద రంగు
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

మీన రాశి (Pisces Today Horoscope 14 March 2024):

ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. శుభకార్యాలు, దైవ కార్యాల మీద ఖర్చులు పెడతారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.

  • ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 8
  • అదృష్ట రంగు: ఊదా
  • పరిహారం : ఈరోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

Also Read: Today Horoscope 13 March 2024 | నేటి రాశిఫలాలు..!