Home   »  ఈరోజు   »   Today Horoscope 20 November 2023: నేడు 12 రాశుల రాశిఫలాల వివరాలు.!

Today Horoscope 20 November 2023: నేడు 12 రాశుల రాశిఫలాల వివరాలు.!

schedule raju

Today Horoscope 20 November 2023 ఈరోజు ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఆర్థిక పరమైన విషయాల్లో శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం…

Today Horoscope 20 November 2023 Details of 12 zodiac signs today

Today Horoscope 20 November 2023: ఈరోజు ప్రేమ, ఆరోగ్యం, డబ్బు, వృత్తికి సంబంధించిన మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి (Aries Today Horoscope 20 November 2023)

ఈరోజు మీ విజయాలు మెరుగుపడతాయి. వృత్తిపరమైన విషయాల్లో సానుకూల ప్రతిపాదనలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సీనియర్ సహోద్యోగులు మీకు సహకరిస్తారు. స్నేహితులు మీ ధైర్యాన్ని పెంచుతారు. ఈరోజు మీరు పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. నేడు మీరు పలు సమావేశాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. ధైర్యం మరియు పరాక్రమం స్పష్టంగా కనిపిస్తుంది. సీనియర్లతో మరింత కనెక్ట్ అవుతారు.

  • ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 8
  • అదృష్ట రంగు: నేవీ బ్లూ
  • పరిహారం : ఈరోజు శ్రీ క్రిష్ణుడిని పూజించాలి.

వృషభ రాశి (Taurus Today Horoscope 20 November 2023)

ఈరోజు మీరు ఆర్థిక వ్యవహారాలు చక్కగా నిర్వహించుకుంటారు. మీకు సీనియర్ల సహకారంతో సక్సెస్ రేటు పెరిగే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. నేడు మీరు రిస్క్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. పరిపాలనా వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మీకు సానుకూల సమాచారం ప్రబలంగా ఉంటుంది. నేడు మీ వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది.

  • ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 2
  • అదృష్ట రంగు: క్రీమ్
  • పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

మిధున రాశి (Gemini Today Horoscope 20 November 2023)

మీరు దీర్ఘకాలిక కార్యకలాపాలపై దృష్టి పెడుతారు. వాగ్దానాలు మరియు కట్టుబాట్లను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అదృష్టం మరియు సహనం మీకు బలంగా మారుతుంది. లక్ష్యాలను సాధించడంలో ఈరోజు మీరు విజయం పొందుతారు. ప్రణాళికలను అమలు చెయ్యడంలో ముందుంటారు. నేడు ముఖ్యమైన పనుల్లో మీరు ఉత్సాహంగా పని చేస్తారు. ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తిని పెరుగుతుంది.

  • ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 11
  • అదృష్ట రంగు: వెండి
  • పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.

కర్కాటక రాశి (Cancer Today Horoscope 20 November 2023)

ఈరోజు మీకు ఊహించని కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రియమైనవారి సూచనలకు శ్రద్ధ వహిస్తారు. ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఎక్కువగా దృష్టి పెడుతారు. మొండితనం మరియు తొందరపాటు ఎక్కువగా ఉంటుంది వీలైనంత వరకు వాటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. క్రమబద్ధమైన ప్రయత్నాలు చెయ్యడానికి ఇష్టపడుతారు. ప్రమాదకర ప్రయత్నాలకు దూరంగా ఉండేవిధంగా చూసుకోండి. పనిలో క్రమబద్ధతను పాటించడానికి ప్రయత్నించండి. పనిలో ఒత్తిడి కారణంగా రాజీ పాడటానికి ప్రయత్నిస్తారు. అపరిచితుల నుండి దూరం ఉండడానికి ఇష్టపడుతారు. వాదనలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడుతారు. ఈరోజు మీ కుటుంబం నుండి సపోర్ట్ లభిస్తుంది.

  • ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 3
  • అదృష్ట రంగు: పసుపు
  • పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ పఠించాలి.

సింహ రాశి (Leo Today Horoscope 20 November 2023)

ఈరోజు మీరు చేసే పని మరియు వ్యాపారంలో లాభాలు పొందుతారు. భూమి మరియు ఆస్తి సంబంధిత కార్యకలాపాలకు సమస్యలను చక్కబెట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల నుండి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. లక్ష్యసాధనలో విజయం సాధించడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. నేడు మీ స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మీరు ప్రియమైన వారితో సరదాగా గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతారు. వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి. నేడు మీరు పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేస్తారు. మీ దాంపత్య జీవితంలో సామరస్యం పెరుగుతుంది.

  • ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 7
  • అదృష్ట రంగు: మెజెంటా
  • పరిహారం : ఈరోజు శని దేవుడికి తైలం సమర్పించాలి.

కన్య రాశి (Virgo Today Horoscope 20 November 2023)

నేడు మీరు కృషి మరియు అంకితభావం ద్వారా విజయం సాధిస్తారు. మీ కెరీర్ మరియు వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. క్రమశిక్షణ మరియు చురుకుదనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. జ్ఞానం మరియు సహకారంతో పని చేసి అందరి మన్ననలను పొందుతారు. ఖర్చులు మరియు పెట్టుబడులపై కొద్దిగా వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఈరోజు మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు అప్పులు చెయ్యడం తగ్గించడానికి ప్రయ్సత్నిస్తే మంచిది. ఉద్యోగం మరియు వ్యాపారంలో ఆశించిన విజయం సాధిస్తారు. అపరిచితులను త్వరగా నమ్ముతారు.

  • ఈరోజు మీకు 89 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: నీలం
  • పరిహారం : ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి.

తులా రాశి (Libra Today Horoscope)

ఈరోజు మీకు ఇతరులతో సఖ్యత పెరుగుతుంది. స్నేహితులు మరియు సహోద్యోగుల నమ్మకాన్ని నేడు మీరు పొందుతారు. యువకులు మెరుగైన నేడు అన్ని రంగాలలో ప్రదర్శన కనబరుస్తారు. నేడు కళాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీరు పెద్దల పట్ల గౌరవాన్ని కాపాడుకోవడం మంచిది. జ్ఞానం మరియు సహకారంతో పని పనిచెయ్యడం వల్ల లక్ష్యాలపై దృష్టి సారిస్తారు. చదువు, బోధన పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తారు.

  • ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 15
  • అదృష్ట రంగు: బ్రౌన్
  • పరిహారం : ఈరోజు పరమశివునికి చందనం సమర్పించాలి.

వృశ్చిక రాశి (Scorpio Today Horoscope)

ఈరోజు మీ కుటుంబంలో పలు రకాల కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. కమ్యూనికేషన్‌లో ప్రభావవంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు ఎక్కువగా వృత్తి, వ్యాపారాలపై దృష్టి సారించడానికి ఇష్టపడుతారు. మీ జీవితంలోని శుభ క్షణాలను పంచుకోవడానికి ఇష్టపడుతారు. మీ వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. మీ వృత్తి మరియు వ్యాపారంలో నిర్వహణ, పరిపాలన మెరుగ్గా ఉంటుంది. ఆస్తి, వాహన వ్యవహారాల్లో నేడు వేగంగా పనులు జరుగుతాయి. ఈరోజు మీకు బంధువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

  • ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 17
  • అదృష్ట రంగు: ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి.

ధనుస్సు రాశి (Sagittarius Today Horoscope)

ఈరోజు మీరు మీ కుటుంబంలో జరిగే పలు కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాజిక అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. సంక్షేమ కార్యక్రమాలపై ఈరోజు ఎక్కువగా దృష్టి సారిస్తారు. ఈ విషయంలోనైనా మీరు సంకోచం లేకుండా స్థిరంగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార, వాణిజ్య రంగాలలో పనిచేస్తున్న వారికీ విజయం చేకూరుతుంది. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో మీరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. బంధువులతో సన్నిహితంగా మెలగడంతో వారి సహకారం పొందుతారు. నేడు బంధు మిత్రులతో బంధాలు మెరుగుపడుతాయి. ఈరోజు మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇష్టపడుతారు.

  • ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: తెలుపు
  • పరిహారం : ఈరోజు బ్రాహ్మాణులకు దానం చేయాలి.

మకరరాశి (Capricorn Today Horoscope)

ఈరోజు మీరు నిశ్చయించుకున్న లక్ష్యాలపై దృష్టి పెడుతారు. కుటుంబ వ్యవహారాలను శ్రద్ధగా నిర్వహిస్తారు తద్వారా మీ గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక రంగంలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి. మీ లక్ష్యాల దిశగా వేగవంతం ముందుకు వెళ్తారు. శుభకార్యాల్లో పాల్గొనడానికి కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చెయ్యడానికి ఇష్టపడుతారు. ఈరోజు గౌరవనీయమైన అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశాలున్నాయి.

  • ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 4
  • అదృష్ట రంగు: ఊదా
  • పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువు 108 సార్లు జపించాలి.

కుంభ రాశి (Aquarius Today Horoscope)

ఈరోజు మీకు కళా నైపుణ్యాలలో వృద్ధి పెరుగుతుంది. నేడు పలు ఆర్ధిక విషయాలలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది తద్వారా మీకు సృజనాత్మకత నిలకడగా పెరుగుతుంది. నేడు చేపట్టిన ముఖ్యమైన పనులు ముందుకు కొనసాగుతాయి. పలు అధికారులతో సంబంధాలను పెరిగే అవకాశం ఉంది దీనివల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది.

  • ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 6
  • అదృష్ట రంగు: కుంకుమపువ్వు
  • పరిహారం : ఈరోజు పార్వతీ దేవిని పూజించాలి.

మీన రాశి (Pisces Today Horoscope)

ఈరోజు మీ వ్యాపారంలో సంస్థ మరియు నిర్వహణ నైపుణ్యాలను బలోపేతం చేస్తారు. పెట్టుబడి కార్యకలాపాలపై ఎక్కువగా ఆసక్తి చూపడం వల్ల బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తిస్తారు. నేడు అంతర్జాతీయ విషయాలలో మీకు పురోగతి ఉంటుంది. నేడు అప్పులు చేయడం మానుకోవడం మంచిది. పనులను సకాలంలో పూర్తి చేయడం, సమయ నిర్వహణ చేయడం వల్ల మీపై సాధారణ ప్రభావాన్ని చూపుతుంది.

  • ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 5
  • అదృష్ట రంగు: పీచు
  • పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.

Also Read: Horoscope Today November 17 2023: నేటి రాశిఫలాలు