Home   »  ఈరోజు   »   Today Horoscope 22 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!

Today Horoscope 22 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!

schedule ranjith

Today Horoscope 22 March 2024 | జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల రోజువారీ జాతకంలో ప్రేమ, ఆరోగ్యం, డబ్బు, వృత్తికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

Today Horoscope 22 March 2024

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో బుధాదిత్య యోగం, సుకర్మ యోగం ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

మేష రాశి (Aries Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని కొత్త శుభవార్తలు వింటారు. దీని వల్ల మీ చుట్టూ ఆనందం నెలకొంటుంది. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.

  • ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 5
  • అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

వృషభ రాశి (Taurus Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు దేని గురించి మొండిగా, గర్వంగా ఉండకూడదు. విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. దూర బంధువులతో కలుస్తారు. ఇంట్లో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టమైన వారితో గడిపే సమయం ఆనందాన్ని కలిగిస్తుంది.

  • ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 23
  • అదృష్ట రంగు: బంగారు రంగు
  • పరిహారం : ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి.

మిథున రాశి (Gemini Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారిలో వ్యాపారులు పెద్ద లక్ష్యాన్ని సాధించేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. యితే అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.

  • ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 6
  • అదృష్ట రంగు: మెరూన్
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

కర్కాటక రాశి (Cancer Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఫలవంతంగా ఉంటుంది. మీరు ఇంట్లో, వెలుపల మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. ఈ రోజు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

  • ఈరోజు మీకు 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 8
  • అదృష్ట రంగు: పసుపు
  • పరిహారం : ఈరోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

సింహ రాశి (Leo Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో అదృష్టం కలిసి రానుంది. మీరు భాగస్వామ్యంతో కొన్ని పనులను ప్రారంభించడం మంచిది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

  • ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 7
  • అదృష్ట రంగు: నారింజ
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

కన్యారాశి (Virgo Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారు ఈరోజు అకస్మాత్తుగా లాభదాయకంగా ఉంటుంది. మీ డబ్బు మీ వ్యాపారంలో ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, మీరు దానిని పొందొచ్చు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు.

  • ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 5
  • అదృష్ట రంగు: ఎరుపు
  • పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

తుల రాశి (Libra Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ లక్ష్యాలలో దేనినైనా సులభంగా సాధించగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు.

  • ఈరోజు మీకు 96 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 4
  • అదృష్ట రంగు: గోధుమ రంగు
  • పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.

వృశ్చిక రాశి (Scorpio Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పథకాలలో కొంత డబ్బును పెట్టుబడి పెట్టొచ్చు. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు స్నేహితులసాయం తీసుకోండి.

  • ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 11
  • అదృష్ట రంగు: గులాబీ రంగు
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

ధనుస్సు రాశి (Sagittarius Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారిలో విద్యార్థులకు మంచి రోజు కానుంది. మీ కళాత్మక నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

  • ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: నీలం
  • పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.

మకర రాశి (Capricorn Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు ఆనందం, శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. విత భాగస్వామితో అభిప్రాయాలను పంచుకుంటారు. అనుకోని విధంగా డబ్బులు కలిసి వస్తుంది.

  • ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 13
  • అదృష్ట రంగు: ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు శివ లింగానికి పాలు సమర్పించాలి.

కుంభ రాశి (Aquarius Horoscope 22 March 2024):

ఈ రాశి వారిలో వ్యాపారం చేసే వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మంచి పేరు సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తి అవుతాయి.

  • ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 6
  • అదృష్ట రంగు: బూడిద రంగు
  • పరిహారం : ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి.

మీన రాశి (Pisces Today Horoscope 22 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు సంపద పెరుగుతుంది. మీ కృషి, అంకితభావంతో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఏదైనా పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు అధిక సంతోషాన్ని పొందుతారు.

  • ఈరోజు మీకు 92 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 6
  • అదృష్ట రంగు: తెలుపు
  • పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.

Also Read | Today Horoscope 20 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!