Home   »  ఈరోజు   »   Today Horoscope 24 March 2024 | ఆదివారం నాటి రాశిఫలాలు..!

Today Horoscope 24 March 2024 | ఆదివారం నాటి రాశిఫలాలు..!

schedule ranjith

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆదివారం రోజున చంద్రుడు సింహ రాశి నుండి కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల రోజువారీ జాతకంలో ప్రేమ, ఆరోగ్యం, డబ్బు, వృత్తికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

Today Horoscope 24 March 2024 | Sunday's horoscope..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆదివారం రోజున చంద్రుడు సింహ రాశి నుండి కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై పూర్వఫాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవి యోగం ఏర్పడనుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి (Aries Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారు ఈరోజు చాలా ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

  • ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 8
  • అదృష్ట రంగు: ఎరుపు
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

వృషభ రాశి (Taurus Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీ కోరిక నెరవేరుతుంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. సన్నిహితులను కలుస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ రోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగవుతాయి.

  • ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 10
  • అదృష్ట రంగు: బూడిద రంగు
  • పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష స్తోత్రం’ పఠించాలి.

మిథున రాశి (Gemini Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని పనులకు ప్రశంసలు పొందొచ్చు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. సంతాన, ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి.

  • ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 2
  • అదృష్ట రంగు: తెలుపు
  • పరిహారం : ఈరోజు శని దేవుడిని దర్శించుకుని తైలం సమర్పించాలి.

కర్కాటక రాశి (Cancer Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ప్రేమ మరియు ఆప్యాయత మీ కుటుంబసభ్యులపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి ఆలోచనతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

  • ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: పసుపు
  • పరిహారం : ఈరోజు బ్రాహ్మాణులకు దానం చేయాలి.

సింహ రాశి (Leo Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారు ఈరోజు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం నెమ్మదిగా సాగడం గురించి మీరు ఆందోళన చెందుతారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.

  • ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 11
  • అదృష్ట రంగు: నీలం
  • పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.

కన్యా రాశి (Virgo Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారు ఈరోజు కష్టపడి పని చేయాలి. మీ పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు. మీ వ్యక్తిగత విషయాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు.

  • ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 15
  • అదృష్ట రంగు: గులాబీ రంగు
  • పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.

తుల రాశి (Libra Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు భాగస్వామ్యంతో ఏదైనా పనిని ప్రారంభిస్తే, మీ భాగస్వామిని సంప్రదించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లాభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి.

  • ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 16
  • అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.

వృశ్చిక రాశి (Scorpio Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో ఉద్వేగానికి గురి కావాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పని చేయాలి. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు.

  • ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 20
  • అదృష్ట రంగు: గోధుమ రంగు
  • పరిహారం : ఈరోజు శ్రీకృష్ణునికి వెన్న, పంచదార సమర్పించాలి.

ధనుస్సు రాశి (Sagittarius Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా పని చేసేటప్పుడు చాలా ఆలోచించాల్సి ఉంటుంది. మీ శత్రువులు కొందరు పనిలో మిమ్మల్ని వేధించడానికి ప్రయత్నిస్తారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి.

  • ఈరోజు మీకు 96 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 16
  • అదృష్ట రంగు: నలుపు
  • పరిహారం : ఈరోజు వస్తువులను దానం చేయాలి.

మకర రాశి (Capricorn Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో బాగా పని చేయడం ద్వారా పేరు సంపాదించడానికి అవకాశం పొందుతారు. మీ ఆర్థిక కార్యకలాపాలు కొన్ని ఊపందుకుంటాయి. ఇంటికి అతిథి రాకతో ఆనందంగా ఉంటారు. మీరు కొందరు స్నేహితులను కలుసుకోవచ్చు. వారితో మీ మనస్సులోని కొన్ని విషయాలను పంచుకోవచ్చు.

  • ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 17
  • అదృష్ట రంగు: ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి.

కుంభ రాశి (Aquarius Horoscope 24 March 2024):

ఈ రాశి వారు ఈరోజు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనొచ్చు. దానధర్మాల పట్ల మీ ఆసక్తి కూడా పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

  • ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 19
  • అదృష్ట రంగు: మెరూన్
  • పరిహారం : ఈరోజు శివ లింగానికి పాలు సమర్పించాలి.

మీన రాశి (Pisces Today Horoscope 24 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా బాగా పని చేస్తారు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మీ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. మీ కుటుంబంతో సంతోషకరమైన క్షణాలను గడుపుతారు.

  • ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 22
  • అదృష్ట రంగు: మెరూన్
  • పరిహారం : ఈరోజు అన్నదానం చేయాలి.

Also Read | Today Horoscope 23 March 2024 | శనివారం నాటి రాశిఫలాలు..!