Home   »  ఈరోజు   »   Today Horoscope 25 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!

Today Horoscope 25 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!

schedule ranjith

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల రోజువారీ జాతకంలో ప్రేమ, ఆరోగ్యం, డబ్బు, వృత్తికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

Today Horoscope 25 March 2024 | Details of today's horoscope..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు కన్యా రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై మృగశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవి యోగం, శోభన యోగం ఏర్పడనుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

మేష రాశి (Aries Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ సభ్యుల నమ్మకాన్ని గెలుచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. సాహసించి పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. సాహసించి పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది.

  • ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 1
  • అదృష్ట రంగు: బంగారు రంగు
  • పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.

వృషభ రాశి (Taurus Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ పనిలో కొన్నింటిని చేయడంలో తొందరపడతారు. ఈ కారణంగా మీరు కొన్ని తప్పులు చేయొచ్చు. సంతృప్తిగా కాలం గడుపుతారు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో తప్పకుండా విజయాలు సాధిస్తారు.

  • ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 3
  • అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు శివ లింగానికి పాలు సమర్పించాలి.

మిథున రాశి (Gemini Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో శుభవార్తలు వినిపిస్తాయి. ప్రజా సంక్షేమ పనుల్లో తలదూర్చి మంచిపేరు సంపాదిస్తారు. కానీ ఏ తప్పు చేసినా సరే అనకూడదు. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. పెద్దల సలహాలు పాటించండి. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సాఫీగా గడిచి పోతాయి.

  • ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 4
  • అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు పేద ప్రజలకు సాయం చేయాలి.

కర్కాటక రాశి (Cancer Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించొచ్చు. ఆకస్మిక లాభం కారణంగా మీ మనస్సులో ఈరోజు సంతోషంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది.

  • ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 7
  • అదృష్ట రంగు: మెరూన్
  • పరిహారం : ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

సింహ రాశి (Leo Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. మీరు చాలా కష్టమైన పనులను కూడా సమయానికి పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో ఏ విషయంలోనైనా వాదించకుండా ఉండాలి. ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకాలు ఎదురవుతాయి. రాబడి బాగుంటుంది.

  • ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 6
  • అదృష్ట రంగు: పసుపు
  • పరిహారం : ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.

కన్యా రాశి (Virgo Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారు మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించొచ్చు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో కుజ, శనుల సంచారం వల్ల బంధువర్గంతోనూ, కొందరు మిత్రులతోనూ మాట పట్టింపులుంటాయి.

  • ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: నారింజ
  • పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువును పూజించాలి.

తుల రాశి (Libra Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఏదైనా వ్యాపార సంబంధిత పని కోసం డబ్బు తీసుకోవలసి వస్తే, దానిని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. రాశ్యధిపతి శుక్రుడు అనుకూలంగా ఉండడం, గురువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది.

  • ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 10
  • అదృష్ట రంగు: ఎరుపు
  • పరిహారం : ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.

వృశ్చిక రాశి (Scorpio Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ బిడ్డకు సంబంధించి ఏదైనా నిర్ణయం హఠాత్తుగా తీసుకుంటే, మీరు తర్వాత చింతించాల్సి ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఉద్యోగులు అందరి మన్ననలనూ పొందుతారు. శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా ఇష్టమైన పనులు చేయడం, ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకోవడం వంటివి జరుగుతాయి.

  • ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 15
  • అదృష్ట రంగు: గోధుమ రంగు
  • పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి..

ధనుస్సు రాశి (Sagittarius Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారు ఈరోజు సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులకు మంచిగా ఉంటుంది. అయితే మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగాసాగుతాయి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. వృథా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

  • ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 5
  • అదృష్ట రంగు: ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు చేపలకు పిండి పదార్థాలను తినిపించాలి.

మకర రాశి (Capricorn Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. మీ సౌకర్యవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా చాలా డబ్బు ఖర్చు చేస్తారు. శారీరక సమస్యలు తీరుతాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విదేశీ ప్రయాణం, ఉన్నతవిద్య అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు వింటారు.

  • ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 13
  • అదృష్ట రంగు: నీలం
  • పరిహారం : ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి.

కుంభ రాశి (Aquarius Horoscope 25 March 2024):

ఈ రాశి వారు ఈరోజు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీ అన్ని పనులను బాధ్యతాయుతంగా చేయాలి. లేకపోతే సమస్యలు తలెత్తొచ్చు. వ్యాపారస్తులు తమ ప్రణాళికలలో కొన్నింటిని పునఃప్రారంభించొచ్చు. మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు చక్కబడతాయి.

  • ఈరోజు మీకు 64 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 17
  • అదృష్ట రంగు: బూడిద రంగు
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

మీన రాశి (Pisces Today Horoscope 25 March 2024):

ఈ రాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ప్రదర్శన కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే, తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కార్యక్ర మాలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తయి మనశ్శాంతి కలుగుతుంది.

  • ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 14
  • అదృష్ట రంగు: తెలుపు
  • పరిహారం : ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి.

Also Read | Today Horoscope 22 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!