Home   »  ఈరోజు   »   Today Horoscope 26 March 2024 | మేషం నుండి మీనరాశుల వారి రాశిఫలాలు..!

Today Horoscope 26 March 2024 | మేషం నుండి మీనరాశుల వారి రాశిఫలాలు..!

schedule raju

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్య రాశి నుండి తుల రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల రోజువారీ జాతకంలో ప్రేమ, ఆరోగ్యం, డబ్బు, వృత్తికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

Today Horoscope 26 March 2024

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్య రాశి నుండి తుల రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో మహాలక్ష్మీ యోగం, ధన యోగం, శష యోగం ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

మేష రాశి (Aries Today Horoscope 26 March 2024):

మేష రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూల ఉంటుంది. అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారి మద్దతుతో ఉన్నత స్థానాలను పొందే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. నేడు మీకు ఇష్టమైనవారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

  • ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 12
  • అదృష్ట రంగు: వెండి రంగు
  • పరిహారం : ఈరోజు శివ జపమాలను పఠించాలి.

వృషభ రాశి (Taurus Today Horoscope 26 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. మనోబలం, ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. చర్చల ద్వారా కుటుంబంలో కొనసాగుతున్న అసమ్మతిని ముగించడంలో మీరు విజయం సాధిస్తారు.

  • ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.

మిథున రాశి (Gemini Today Horoscope 26 March 2024):

కుటుంబ జీవితంలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి. వృత్తి జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సానుకూల ఫలితాలున్నాయి. తోటివారి సహకారం లాభిస్తుంది. మీ ప్రయత్నాలు కొన్ని విజయవంతమవుతాయి. నేడు విద్యార్థులకు అనుకూలమైన రోజు, విద్యార్థులు ఏదైనా పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

  • ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 2
  • అదృష్ట రంగు: పసుపు
  • పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.

కర్కాటక రాశి (Cancer Today Horoscope 26 March 2024):

కర్కాటక రాశివారు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదువుతాయి. కీలక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒకరి మాటలను అనుసరించి మీ డబ్బును ఏ పథకంలోనూ పెట్టుబడి పెట్టకండి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యుల నుంచి బహుమతులు పొందొచ్చు. ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాలను పరిష్కారం దిశగా అడుగుపడుతుంది.

  • ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 4
  • అదృష్ట రంగు: నారింజ
  • పరిహారం : ఈరోజు తెల్లని వస్తువులను దానం చేయాలి.

సింహ రాశి (Leo Today Horoscope 26 March 2024):

సింహ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా ఇబ్బందులుంటాయి. ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. సోమరితనానికి దూరంగా ఉండండి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ముఖ్య వ్యవహారాల్లో పెద్దలను అభిప్రాయం అడగడం ఉత్తమం.

  • ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 8
  • అదృష్ట రంగు: గులాబీ రంగు
  • పరిహారం : ఈరోజు శివ చాలీసాను పఠించాలి.

కన్యా రాశి (Virgo Today Horoscope 26 March 2024):

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఆశించిన లాభాలను పొందుతారు. మీ పురోగతిని చూసి మీ శత్రువులు అసూయపడతారు. భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల సహకారంతో కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో మీ ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలు గడుపుతారు.

  • ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 1
  • అదృష్ట రంగు: తెలుపు
  • పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.

తుల రాశి (Libra Today Horoscope 26 March 2024):

రోజు మీకు సాధారణంగానే ఉంటుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు. న్యాయపరమైన వ్యవహారాల్లో అనవసర చర్చ పెట్టొద్దు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని కీలకమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు మీ పిల్లలు చేసిన పనికి ప్రశంసలు పొందుతారు.

  • ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 7
  • అదృష్ట రంగు: బూడిద రంగు
  • పరిహారం : ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.

వృశ్చిక రాశి (Scorpio Today Horoscope 26 March 2024):

నేడు వీరికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. స్వయంకృషితో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు పిల్లల వైపు నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వింటారు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కెరీర్‌లో కొత్త మార్పులు వస్తాయి.

  • ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 3
  • అదృష్ట రంగు: బంగారు రంగు
  • పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

ధనుస్సు రాశి (Sagittarius Today Horoscope 26 March 2024):

నేటి రాశి ఫలాల ప్రకారం ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. మీ సోదరులతో ఏదైనా విభేదాలు ఉంటే, అది ఈరోజు ముగిసిపోవచ్చు. పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధికి కొత్త అవకాశాల గురించి ఆలోచిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు.

  • ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 5
  • అదృష్ట రంగు: గోధుమ రంగు
  • పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.

మకర రాశి (Capricorn Today Horoscope 26 March 2024):

ఈ రాశి వారు ఈరోజు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. కార్యాలయంలోని సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఈరోజు మంచిది. కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

  • ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 16
  • అదృష్ట రంగు: ఎరుపు
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

కుంభ రాశి (Aquarius Horoscope 26 March 2024):

ఈ రోజు మీరు వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావొచ్చు. వ్యాపార సంబంధిత నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన ఆలోచనలతో మంచి ఫలితాలు పొందుతారు. పని చేసే వ్యక్తులు మంచి పనితీరును కనబరుస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు.

  • ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 14
  • అదృష్ట రంగు: ఎరుపు
  • పరిహారం : ఈరోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

మీన రాశి (Pisces Today Horoscope 26 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు మతపరమైన కార్యకలాపాలపై విశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు ఈరోజు గురువుల ఆశీస్సులు పొందుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు విజయాన్నిస్తాయి.ప్రతిభతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉండేవారు ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కీలక వ్యవహారములో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

  • ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి.

Also Read: Today Horoscope 25 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!