Home   »  ఈరోజు   »   Today Horoscope 27 March 2024 | ద్వాదశ రాశుల రాశిఫలాలు..!

Today Horoscope 27 March 2024 | ద్వాదశ రాశుల రాశిఫలాలు..!

schedule raju

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు తులారాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై హస్తా, చిత్రా నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల రోజువారీ జాతకంలో ప్రేమ, ఆరోగ్యం, డబ్బు, వృత్తికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

Today Horoscope 27 March 2024

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు తులారాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై హస్తా, చిత్రా నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో పుష్కర యోగం, బుధాదిత్య యోగం వంటి శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి (Aries Today Horoscope 27 March 2024):

రుణాలు, ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటి సమస్య ఒకటి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణము అనుకూలంగా ఉంటుంది.

  • ఈరోజు మీకు 83 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 5
  • అదృష్ట రంగు: గోధుమ రంగు
  • పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.

వృషభ రాశి (Taurus Today Horoscope 27 March 2024):

ఈ రాశివారికి కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్వక్ష్యంగా వ్యవహరించవద్దు. వివాహ నిర్ణయాలకు ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అనవసర విషయాలతో కాలాన్ని వృధాచేయకండి.

  • ఈరోజు మీకు 69 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: నీలం
  • పరిహారం : ఈరోజు కన్నయ్యకు వెన్న, పంచదార సమర్పించాలి.

మిథున రాశి (Gemini Today Horoscope 27 March 2024):

ఈరోజు ఈ రాశివారు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆరోగ్యం దెబ్బతినొచ్చు, జాగ్రత్తపడండి. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. ముఖ్యమైన పనుల్లో బాగా ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లి గొప్ప ఫలితాలను అందుకుంటారు.

  • ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 2
  • అదృష్ట రంగు: ఎరుపు
  • పరిహారం : ఈరోజు ఆవుకి పచ్చి గడ్డి తినిపించండి.

కర్కాటక రాశి (Cancer Today Horoscope 27 March 2024):

ఈ రాశి వ్యాపారులు, ఉద్యోగులకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. క్రీడలు, అడ్వర్టయిజ్‌మెంట్‌, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉద్యోగ పరంగా బాగా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

  • ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 6
  • అదృష్ట రంగు: నారింజ
  • పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయండి.

సింహ రాశి (Leo Today Horoscope 27 March 2024):

ఈ రాశికి చెందినవారిని ఏదో తెలియని ఆందోళన వెంటాడుతుంది. వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగరంగంలో చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. కుటుంబ వాతావరణం సామరస్యంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

  • ఈరోజు మీకు 99 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 3
  • అదృష్ట రంగు: ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయండి.

కన్యా రాశి (Virgo Today Horoscope 27 March 2024):

ఈ రాశివారికి కుటుంబంలో, పనిచేసే ప్రదేశంలోనూ ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

  • ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 1
  • అదృష్ట రంగు: గోధుమ రంగు
  • పరిహారం : ఈరోజు శివ జప మాలను పఠించాలి.

తుల రాశి (Libra Today Horoscope 27 March 2024):

ఈ రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారములలో మీ అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. వృత్తిలో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు దూరప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

  • ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 4
  • అదృష్ట రంగు: గులాబీ రంగు
  • పరిహారం : ఈరోజు తులసికి నీరు సమర్పించి దీపం వెలిగించాలి.

వృశ్చిక రాశి (Scorpio Today Horoscope 27 March 2024):

ఈ రాశివారికి ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వీరి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. సన్నిహితులతో చర్చలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనుభవానికి వస్తాయి. బాగా ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టవద్దు. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది.

  • ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 8
  • అదృష్ట రంగు: బూడిద రంగు
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

ధనుస్సు రాశి (Sagittarius Today Horoscope 27 March 2024):

ఈ రాశివారికి కుటుంబం నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. విద్యా రుణాలు మంజూరవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. ఆశించిన శుభవార్త వింటారు. బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమములలో పాల్గొంటారు.

  • ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 7
  • అదృష్ట రంగు: బంగారు రంగు
  • పరిహారం : ఈరోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.

మకర రాశి (Capricorn Today Horoscope 27 March 2024):

ఈ రాశివారి సృజనాత్మక ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల కలయికతో మనసు ఉల్లాసంగా ఉంటుంది. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళండి. ఖర్చులు బాగా పెరిగినా, ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.

  • ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 11
  • అదృష్ట రంగు: తెలుపు
  • పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

కుంభ రాశి (Aquarius Horoscope 27 March 2024):

ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో రిస్క్ తీసుకోవద్దు. లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించాలి. వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. లక్ష్య సాధనకు పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు గత అనుభవంతో మంచి పురోగతి సాధిస్తారు. మిత్రుల సహాయంతో ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది.

  • ఈరోజు మీకు 71 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 18
  • అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని సమర్పించాలి.

మీన రాశి (Pisces Today Horoscope 27 March 2024):

ఈ రాశి వారి వ్యాపారం బాగా సాగుతుంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. సన్నిహితులో ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తాయి. వేడుకలు, సమావేశాలకు సన్నాహాలు చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

  • ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 16
  • అదృష్ట రంగు: పసుపు
  • పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.

Also Read: Today Horoscope 26 March 2024 | మేషం నుండి మీనరాశుల వారి రాశిఫలాలు..!