Home   »  ఈరోజు   »   Today Horoscope 29 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!

Today Horoscope 29 March 2024 | నేటి రాశిఫలాల వివరాలు..!

schedule ranjith

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు తులా రాశి నుండి వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుండి మీన రాశుల రోజువారీ జాతకంలో ప్రేమ, ఆరోగ్యం, డబ్బు, వృత్తికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

Today Horoscope 29 March 2024 | Details of today's horoscope..!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు తులా రాశి నుండి వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రాజయోగంతో పాటు హర్ష యోగం, లక్ష్మీ యోగం ఏర్పడనున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి (Aries Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. మీ స్నేహితుడి ఇంట్లో జరిగే మతపరమైన కార్యక్రమానికి హాజరు కావొచ్చు. ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

  • ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 9
  • అదృష్ట రంగు: గోధుమ రంగు
  • పరిహారం : ఈరోజు శ్రీకృష్ణునికి వెన్న, పంచదార మిఠాయిని సమర్పించాలి.

వృషభ రాశి (Taurus Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారు ఈరోజు తమ వ్యక్తిగత సంబంధాలకు బలం చేకూర్చే ప్రయత్నం చేస్తారు. చేస్తారు. మీలో ఉన్న అదనపు శక్తి కారణంగా, మీ వనరుల పనిపై కూడా శ్రద్ధ చూపుతారు. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈరోజు పొదుపు పథకాలపై పూర్తి శ్రద్ధ చూపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం కలుగుతుంది.

  • ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 3
  • అదృష్ట రంగు: ఎరుపు
  • పరిహారం : ఈరోజు సూర్య నారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి.

మిథున రాశి (Gemini Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో సులభంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉంటుంది.

  • ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 1
  • అదృష్ట రంగు: నారింజ
  • పరిహారం : ఈరోజు పేద ప్రజలకు సాయం చేయాలి.

కర్కాటక రాశి (Cancer Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఫలవంతంగా ఉంటుంది. మీ కెరీర్‌లో వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా పొందుతారు. ఈ రోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. పట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

  • ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 4
  • అదృష్ట రంగు: నీలం
  • పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.

సింహ రాశి (Leo Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలొస్తాయి. మీ అనుభవం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ముఖ్యంగా విలాసాల మీద ఖర్చు ఎక్కువయ్యే అవకాశముంది. పొదుపు చర్యలు పాటించడం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కుటుంబంతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు.

  • ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 8
  • అదృష్ట రంగు: గులాబీ రంగు
  • పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.

కన్యా రాశి (Virgo Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు కొన్ని పనులలో సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు అందుతాయి.

  • ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 10
  • అదృష్ట రంగు: బూడిద రంగు
  • పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

తుల రాశి (Libra Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాల పరిష్కారదిశగా సాగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపో తాయి.

  • ఈరోజు మీకు 94 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 7
  • అదృష్ట రంగు: గులాబీ రంగు
  • పరిహారం : ఈరోజు గురువు లేదా సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు పొందాలి.

వృశ్చిక రాశి (Scorpio Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీరు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి ప్రయోజనం పొందొచ్చు. భాగస్వామ్యంలో పని చేయడం ద్వారా మీరు బాగా పని చేస్తారు. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు లభిస్తాయి. కొందరు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

  • ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 11
  • అదృష్ట రంగు: బంగారు రంగు
  • పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.

ధనుస్సు రాశి (Sagittarius Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఎవరినైనా గుడ్డిగా విశ్వసిస్తే అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. కుటుంబ సమస్యల తోడ్పాటుతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి.

  • ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 12
  • అదృష్ట రంగు: ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు తులసికి నిత్యం నీరు సమర్పించి దీపం వెలిగించాలి.

మకర రాశి (Capricorn Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలోని శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

  • ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 15
  • అదృష్ట రంగు: తెలుపు
  • పరిహారం : ఈరోజు అవసరమైన వారికి అన్నం దానం చేయాలి.

కుంభ రాశి (Aquarius Horoscope 29 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రావొచ్చు. మీ కుటుంబంలో ఆనందం, సౌఖ్యం పెరుగుతుంది. ఈరోజు మీ విలువైన వస్తువులు కొన్ని దొంగిలించబడొచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కార్యాలయంలో అహంకారంతో మాట్లాడకూడదు. లేకపోతే మీరు చెప్పే దాని గురించి ఎవరైనా చెడుగా భావించొచ్చు. తొందరపాటుతో తీసుకునే ఏ నిర్ణయమైనా మిమ్మల్ని కలవరపెడుతుంది. మీకు ఏదైనా ఆస్తికి సంబంధించిన వివాదం ఉంటే, అందులో మీరు గెలుస్తారు.

  • ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 20
  • అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
  • పరిహారం : ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.

మీన రాశి (Pisces Today Horoscope 29 March 2024):

ఈ రాశి వారికి ఈరోజు పురోగతి లభిస్తుంది. మీరు అందరినీ ఎక్కడికైనా తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీగా ఉంటారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కష్టానికి, పెట్టుబడికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన బాధ్యతలు పెరుగుతాయి.

  • ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
  • అదృష్ట సంఖ్య: 16
  • అదృష్ట రంగు: పసుపు
  • పరిహారం : ఈరోజు గోమాతకు తొలి రోటీ తినిపించాలి.

Also Read | Today Horoscope 27 March 2024 | ద్వాదశ రాశుల రాశిఫలాలు..!